వేములవాడ: భీమన్నను సోమవారం 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వేసవి సెలవులు చివరి దశకు చేరుకోవడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలివస్తున్నారు. భీమన్నకు అభిషేకాలు, అన్నపూజలు, కోడె మొక్కులు, కల్యాణాలు, సత్యనారాయణ వ్రతాలు, అమ్మవారికి కుంకుమ పూజ మొక్కులు చెల్లించుకున్నారు. వీఐపీల రద్దీ పెరిగిపోవడంతో ప్రొటోకాల్ కార్యాలయం కిటకిటలాడింది. బ్రేక్ దర్శనాలు, వీఐపీ కోడె టికెట్ తీసుకున్న భక్తులకు రూ.100కు స్వామి వారి క్యాలెండర్ అందజేశారు. వీఐపీల పేరున ఇతరులు భక్తులకు దర్శనాలు చేయిస్తున్నారన్న సమాచారం అందుకున్న అధికారులు శంకరమఠం ప్రధాన గేటును మూసివేసి ప్రత్యేక సిబ్బందిని నియమించారు. టికెట్ లేకుండా ఎవరినీ అనుమతించలేదు. ఈవో రమాదేవి, ఏఈవో అశోక్, పర్యవేక్షకులు భక్తుల ఏర్పాట్లను పరిశీలించారు.


