పిల్లలం–బడి పిల్లలం | - | Sakshi
Sakshi News home page

పిల్లలం–బడి పిల్లలం

May 26 2026 12:05 AM | Updated on May 26 2026 12:05 AM

మేం పిల్లలం బడి పిల్లలం

మా భరతమాత మల్లెలం

రోజు వెళతాం మా బడికి

జీవిత పాఠం నేర్పే గుడికి !

జాతీయ గీతం పఠిస్తం

వందేమాతరం జపిస్తం

ప్రతిజ్ఞ పాలన పాటిస్తం

త్రికరణ శుధ్ధికి చోటిస్తం

ఆటలు అంటే మాకెంతో ప్రేమ!

ఆ ఆటలకై మేం పడతాం శ్రమ

పాటలంటే మాకెంతో ప్రాణం

వినిపిస్తాం మేం గంధర్వ గానం

పాటలకు పల్లవియే ప్రాణం

ఆటలకు చెల్లదు నిస్త్రాణం

గురువు చెప్పిన ఈ మాట

మరువం మేము ఏ పూట !

ఆటపాటల ఆయువును పట్టి

తెలివితేటలతో మేం జతకట్టి

మైదానంలో ఆడుతాం నిత్యం

నిదానం పాటించుట సత్యం!

పాటల పల్లకి వెంటనే ఎక్కి

పాటల పల్లవికే ఉంటేనే చిక్కి

పాట స్ఫూర్తిని పెంచుకుంటం గెలుపు బాటను ఎంచుకుంటం !

గుర్రాల లక్ష్మారెడ్డి, కవి రచయిత

ఊరు: కల్వకుర్తి

జిల్లా: నాగర్‌ కర్నూల్‌

Advertisement
 
Advertisement
Advertisement