13 అంగన్‌వాడీలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

13 అంగన్‌వాడీలు ప్రారంభం

May 26 2026 12:05 AM | Updated on May 26 2026 12:05 AM

బాధితులకు అండగా నిలవాలి : ఎస్పీ ‘ఆరోగ్యవంతమైన సమాజం కోసం పనిచేద్దాం’ అభివృద్ధిని చూసి చేరికలు ● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ● 77 మంది పంచాయతీ కార్యదర్శుల బదిలీ

సిరిసిల్ల: జిల్లాలోని 13 అంగన్‌వాడీ భవనాలను సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ‘మహిళా సంక్షేమ వారోత్సవాల’ సందర్భంగా జిల్లాలోని 103 ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, మెప్మా ఏవో మీర్జా ఫసహత్‌ అలీ బేగ్‌, అదనపు డీఆర్డీవో శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

వారం రోజుల్లో కొనుగోళ్లు ముగించాలి

ధాన్యం కొనుగోళ్లను వారం రోజుల్లో ముగించాలని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మండలాల వారీగా కొనుగోలు కేంద్రాల్లోని పరిస్థితులు, ధాన్యం నిల్వ సామర్థ్యం వివరాలు ఆరా తీశా రు. రైస్‌మిల్లులకు టార్గెట్‌ ఇవ్వాలని ఆదేశించారు. తూకం వేసిన ధాన్యం బస్తాలు తరలించేందుకు సరిపడా వాహనాలు సమకూర్చాలని సూచించారు.

సిరిసిల్ల: బాధితులకు పోలీసులు అండగా నిలవాలని ఎస్పీ మహేశ్‌ బీ గీతే కోరారు. ఎస్పీ ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌ డేలో 41 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేసి బాధితులతో మాట్లాడారు. ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం న్యాయం జరిగే విధంగా చూడాలని సూచించారు.

ముస్తాబాద్‌(సిరిసిల్ల): ఆరోగ్యవంతమైన సమాజం కోసం కలిసి కట్టుగా పనిచేయాలని జిల్లా ఇమ్యూనైజేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సంపత్‌ కోరారు. ముస్తాబాద్‌ మండలం పోతుగల్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఇమ్యూనైజేషన్‌ ఆఫీసర్‌ సంపత్‌ సోమవారం తనిఖీ చేశారు. గర్భిణీలు, పిల్లలకు అందిస్తున్న టీకాలను పరిశీలించారు. వైద్యాధికారి అఫీజ, పీహెచ్‌ఎన్‌ జ్యోతి, హెచ్‌ఈవో భూమయ్య, సూపర్‌వైజర్‌ ప్రసాద్‌ ఉన్నారు.

బోయినపల్లి(చొప్పదండి): కాంగ్రెస్‌ అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి పలువు రు పార్టీలో చేరుతున్నారని చొప్పదండి ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండలంలోని కోరెంకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు ముడుపు మల్లారెడ్డి సోమవారం కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మనబో యిన సువీన్‌, నాయకులు వన్నెల రమణా రెడ్డి, అజయ్‌, పులి హన్మాండ్లు పాల్గొన్నారు.

పల్లె పరిపాలనలో కుదుపు

సిరిసిల్ల: గ్రామపంచాయతీ పరిపాలనలో కీలకమైన పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేస్తూ కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ సోమవారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. 77 మంది పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేయడంతో ఒక్కసారిగా పల్లెపరిపాలన భారీ కుదుపునకు గురైంది. ఒకే ప్రాంతంలో నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న కార్యదర్శులను గుర్తించి కలెక్టర్‌ కౌన్సెలింగ్‌ చేశారు. సొంత మండలం కాకుండా.. చేసిన మండలాన్ని మళ్లీ కేటాయించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా పంచాయతీ అధికారి షరీఫొద్దీన్‌, డీఎల్‌పీవో నరేశ్‌ పాల్గొన్నారు.

ఆలయ ఉద్యోగులకు బదిలీ

వేములవాడ: రాజన్న ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగులకు బదిలీ అయ్యింది. పర్యవేక్షకులు వెంకటప్రసాద్‌ యా దగిరిగుట్టకు, సంజీవ్‌రావు బాసర ఆలయాలకు బదిలీ అయ్యారు. కోరుకున్న చోటుకు వె ళ్లేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆలయ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement