వేములవాడ: పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణ పరిధిలో 30 మంది లబ్ధిదారులకు రూ.9.83 లక్షలు, వేములవాడ రూరల్ మండల పరిధిలో 13 మందికి రూ.4.32 లక్షల విలువగల చెక్కులను మంగళవారం అందజేశారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, మున్సిపల్ వైస్‌చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
వేములవాడరూరల్: నమ్మకం, విశ్వాసంతో కష్టపడి కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. మంగళవారం విప్‌ను రూరల్ మండల అధ్యక్షుడిగా ఎన్నికై న సోయినేని కరుణాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని విప్ సూచించారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, మహిళా అధ్యక్షురాలు సోయినేని లహరి, మాజీ అధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్, బత్తిని ఎల్లయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్లటౌన్: తరుచూ వరదలతో ముంపునకు గురవుతున్న శ్రీనగర్‌కాలనీ అభివృద్ధికి పాలకవర్గం పెద్దపీట వేస్తుందని మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ అన్నారు. మంగళవారం 2వ వార్డు సందర్శనలో భాగంగా కచ్చా కాలువలలో పూడికతీత పనులను పరిశీలించారు. రాబోయే వర్షాకాలం దృష్ట్యా బోనాల, వెంకంపేట, సర్దార్‌నగర్, పద్మానగర్, రాజీవ్‌నగర్ మీదుగా ఉదర కాల్వ ద్వారా వచ్చే వరదతో కొత్తచెరువు కింది ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఆ నీటిని మానేరులోకి మళ్లించేందుకు శ్రీనగర్‌కాలనీ మీదుగా కచ్చాకాల్వ నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందన్నారు. స్థానిక సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు.
జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి
కిశోర బాలికలు జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని చైర్‌పర్సన్ జిందం కళ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో జరిగిన కౌమార బాలికల హెల్త్ స్క్రీనింగ్ క్యాంపులో పాల్గొని మాట్లాడారు. 10 నుంచి 19 ఏళ్ల బాలికలు పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. కార్యక్రమాల్లో డీఎంహెచ్‌వో డాక్టర్ రజిత, మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, కౌన్సిలర్ బత్తుల రమేశ్, శ్రీనగర్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సుందరయ్య విగ్రహం ఏర్పాటు చేయాలి
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రం సిరిసిల్లలో పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహం ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ కోరారు. మంగళవారం స్థానిక పార్టీ ఆఫీసులో సుందరయ్య 41వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సుందరయ్యనగర్‌లో విగ్రహం ఏర్పాటు చేసేందుకు మున్సిపాలిటీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్ బత్తుల రమేశ్, దుబాల వెంకటేశం, కట్ల సతీశ్, వెంగళ శ్రీనివాస్, సీపీఎం జిల్లా కార్యదర్శి కోడం రమణ, సూరం పద్మ, గణేశ్, రాజమల్లు, శ్రీరామ్ సదానందం, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సిరిసిల్ల ప్రాంత ప్రజలకు తాగు, సాగునీటికి జీవనాధారమైన ఎగువమానేరు ప్రాజెక్టును కాపాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కోరారు. మంగళవారం ఎల్లారెడ్డిపేటలో మాట్లాడారు. గతంలో వచ్చిన వరదలతో రైతులకు వరప్రదాయిని అయిన నర్మాల ప్రాజెక్టు అఫ్రాన్ దెబ్బతిందన్నారు. ప్రాజెక్టు గోడలు ప్రమాదకరంగా మారాయని, వెంటనే మరమ్మతు చేయాలని కోరారు. ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడిక తొలగించాలని, గొలుసుకట్టు కాల్వలకు మరమ్మతు చేయాలని కోరారు. నాయకులు మీసం లక్ష్మణ్, కుర్ర రాకేశ్ తదితరులున్నారు.


