ఇల్లంతకుంట: మండలంలోని రహీంఖాన్‌పేట మోడల్‌స్కూల్ విద్యార్థి మెడకొక్కుల హర్షిని 588 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచింది. బోడ సాయిహర్షితకు 586 మార్కులు వచ్చినట్లు ప్రిన్సిపాల్ గంగాధర్ తెలిపారు. రేపాక ప్రభుత్వ పాఠశాల విద్యార్థి బొడ్డు వర్షినికి 587 మార్కులు సాధించింది. బాలికల గురుకులం నుంచి మాందాడి హనీ 586, బాలసాని రుచిత 580 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ సంధ్యారాణి తెలిపారు. కేజీబీవీ నుంచి వాడే లాస్యరెడ్డి 575, బి.సహస్ర 572 మార్కులు సాధించారని ప్రిన్సిపాల్ శిరీష పేర్కొన్నారు. మండలంలో 506 మందికి 505 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
బోడ సాయిహర్షిత
బాలసాని
రిషిత
మెడకొక్కుల హర్షిని
బొడ్డు
వర్షిని


