బోయినపల్లి(చొప్పదండి): గంగాధరలో నడిచే బోయినపల్లి గురుకులం విద్యార్థి మాచర్ల ఉమేశ్‌చంద్ర 575 మార్కులతో మండల టాపర్‌గా నిలిచాడు. కొదురుపాక హైస్కూల్ విద్యార్థి మహేశ్వరి 565, విలాసాగర్ హైస్కూల్ నుంచి ఆర్.హారిక 558, బోయినపల్లి కేజీబీవీ విద్యార్థి కె.మన్మిత 551, ఎ.సంజనాశ్రీ 545, మోడల్‌స్కూల్ విద్యార్థులు డి.గాయత్రి 547, బి.శరణ్య 545 మార్కులు సాధించారు. మండలంలో మొత్తం 301 మందికి 299 మంది ఉత్తీర్ణులు అయ్యారని ఎంఈవో ఎన్.శ్రవణ్‌కుమార్ తెలిపారు.
ఉమేశ్‌చంద్ర
ఆర్.హారిక
మహేశ్వరి


