డీపీఆర్‌వోకు అభినందనలు | - | Sakshi
Sakshi News home page

డీపీఆర్‌వోకు అభినందనలు

Apr 29 2026 8:42 AM | Updated on Apr 29 2026 8:42 AM

సిరిసిల్ల: జిల్లా పౌర సంబంధాల అధికారిగా ఏడుకొండలు ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. డీపీఆర్వో ఆఫీస్‌లో మంగళవారం రాష్ట్ర గవర్నర్‌ ప్రెస్‌ సెక్రటరీ మామిండ్ల దశరథం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డీపీఆర్‌వోకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

నిరంతరంగా నాణ్యమైన విద్యుత్‌

తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని లక్ష్మీపూర్‌ గ్రామ విద్యుత్‌ ఉపకేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫీడర్‌ బ్రేకర్‌ పనులను టీజీఎన్‌పీడీసీఎల్‌ చీఫ్‌ ఇంజనీర్‌ అన్నపూర్ణ మంగళవారం పరిశీలించారు. ‘విద్యుత్‌ ప్రజా బాట’లో భాగంగా గ్రామ సర్పంచ్‌, రైతులు కోరిన మేరకు పరిశ్రమలకు, గ్రామానికి నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేసేందుకు కొత్త ఫీడర్‌ బ్రేకర్‌ మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. రైతులకు, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌ఈ గోపికృష్ణ, డీఈలు చంద్రమౌళి, అంజయ్య, ఏడీఈలు ప్రశాంతి, గోపీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలి

సిరిసిల్లటౌన్‌: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉపాధి అవకాశాలను ట్రాన్స్‌జెండర్స్‌ సద్వి నియోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ హన్మంతు అన్నారు. మంగళవారం సిరిసిల్ల కోర్టు ఆవరణలో జిల్లా పరిశ్రమల శాఖ, ఇన్ఫోసెమ్‌ సంస్థ ఆధ్వర్యంలో ట్రాన్స్‌జెండర్స్‌కు నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ఉపాధి అవకాశాలు కనిపించని స్థితిలో చాలామంది ట్రాన్స్‌జెండర్స్‌ భిక్షాటన వంటి పరిస్థితుల్లో గడుపుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్‌ యూనిట్ల(పీఎంఎఫ్‌ఎంఈ)తో ఉపాధి పొందాలన్నారు. ఇందుకు ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు మార్కెటింగ్‌ మద్దతు కలిగిస్తుందన్నారు. చిన్న, సూక్ష్మ పరిశ్రమలు దేశాభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయని, వాటికి కూడా ప్రభుత్వం రుణాలు, సబ్సిడీ అందిస్తుందని, యువత, ట్రాన్స్‌జెండర్స్‌ ప్రభుత్వ చేయూతను అందిపుచ్చుకోవాలని కోరారు. సదస్సులో అసిస్టెంట్‌ మేనేజర్‌ శివసాయికృష్ణ, ఇన్ఫోసెమ్‌ అధ్యక్షులు మహేశ్‌, దినేశ్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎన్‌ఎఫ్‌డీపీతో మత్స్యకారులకు మేలు

రుద్రంగి: ఎన్‌ఎఫ్‌డీపీతో మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లా ఫిషరిష్‌ ఆఫీసర్‌ సౌజన్య పేర్కొన్నారు. మంగళవారం నేషనల్‌ ఫిషరీస్‌ డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌ (ఎన్‌ఎఫ్‌డీపీ)పై మండలకేంద్రంలోని సంఘ భవనంలో గంగపుత్రులకు అవగాహన కల్పించారు. 18 ఏళ్లు నిండిన గంగపుత్ర ఆడ, మగ సభ్యులు ఎన్‌ఎఫ్‌డీపీ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. లేకుంటే మత్స్యకార సంక్షేమ పథకాలు, ప్రమాద బీమా అందయని వివరించారు. ఈ నెల 30 వరకు పోర్టల్‌లో నమోదుకు అవకాశం ఉందన్నారు. ఫిషరీస్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ కిరణ్‌, అసిస్టెంట్‌ ఫిషరీస్‌ ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు ధర్మేందర్‌, సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement