వానాకాలం సీజన్ రూ.1.37 కోట్లు.. వేసవి రూ.6.47 కోట్ల బకాయిలు రెండు విడతల కమీషన్ కోసం ఎదురుచూపులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మహిళా సంఘాల ఇబ్బందులు నిర్వహణ ఖర్చులు భారమవుతున్నాయని ఆవేదన
hÌêÏ-ÌZ 2024&-25ÌZ ÐólçÜÑ, Ðé¯éM>ÌS… ïÜf¯ŒS-ÌSMýS$ çÜ…º…«¨…_ 189 IMóSï³ «§é¯]lÅ… Mö¯]l$-VøË$ MóS…{§é-ÌS¯]l$ HÆ>µr$ ^ólÔ>Æý‡$. hÌêÏ A«¨M>Ç ¯]lÐ]l$Ã-M>°² Ð]lÐ]l¬Ã ^ólĶæ$-MýS$…yé Ð]l$íßæ-âýæ-Ë$ A…™ól _™èl¢-Ô¶æ$-¨®™ø «§é¯éÅ-°² ò³§ýlª G™èl$¢¯]l õÜMýS-Ç…_ ÇM>Æý‡$z çÜ–íÙt…^éÆý‡$. MìSÓ…sêÌŒæMýS$ {糿¶æ$-™èlÓ… Æý‡*.32 MýSÒ$çÙ¯ŒS CçÜ$¢…¨. Æð‡…yýl$ ïÜf¯ŒS-ÌSMýS$ çÜ…º…«¨…_ 24,54,196 MìSÓ…sêâýæÏ «§é¯]lÅ… õÜMýS-Ç…-^éÆý‡$. C…§ýl$MýS$ V>¯]l$ Ððl¬™èl¢… MýSÒ$çÙ¯ŒS Æý‡*.7,85,34,186 ò³…yìl…-VŠæ-ÌZ E…¨.
వేసవి సీజన్ కమీషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు
మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన కమీషన్ బకాయిలపై అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా.. 2024–25 వేసవి సీజన్ మొత్తాన్ని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా మండలాల్లోని గ్రామైక్య సంఘాలకు నిధులు జమ చేశామని స్పష్టం చేశారు. కేవలం ఖరీఫ్ సీజన్ కమీషన్ మాత్రమే బకాయి ఉంటుందని వివరించారు. ఇప్పటికే సర్క్యులర్ జారీ చేశామని స్పష్టం చేశారు. సివిల్ సప్‌లై నుంచి వచ్చిన కమీషన్ రూ.6.22కోట్లు త్వరలోనే గ్రామైక్య సంఘాలకు బదిలీ చేస్తామన్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు డీపీఎంకు చేరినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు స్పష్టం చేశారు.
భారంగా నిర్వహణ
ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ అంతా ఆషామాషీ కాదు. కేంద్రంలో చలువ పందిళ్లు, తాగునీటి ఏర్పాటు, ట్యాబ్, రోజువారీగా ఏడుగురు మహిళలకు వేతనాలు, మాయిశ్చర్ యంత్రాలు, కేంద్రంలో భూమి చదును వంటి పనులు నిర్వాహకులే చూసుకోవాలి. ఏఎంసీలు టార్పాలిన్లు, వేయింగ్ మిషన్లు అందిస్తారు. ఒక్కో కేంద్రం నిర్వహణకు ఖర్చు రెండునెలల్లో రూ.2.50 లక్షల నుంచి రూ.3లక్షల వరకు వస్తుంది. ఇదంతా ముందుగా మహిళా సంఘాలే భరించాలి. ప్రభుత్వం ఇచ్చే కమీషన్ ఆలస్యం కావడంతో అది వారికి భారంగా మారింది. అధికారులు ఇచ్చినప్పుడే కమీషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండడంతో గ్రామైక్య సంఘాలు నిర్వాహణ భారం మోయాల్సి వస్తోంది.
పోతుగల్‌లో గత సీజన్‌లో మేము ఏడుగురు మహిళలం ధాన్యం సేకరణ కేంద్రం నిర్వహించాం. 23వేల క్వింటాళ్ల ధాన్యం సేకరించి ఇచ్చాం. దానికి సంబంధించిన కమీషన్లు ఇంకా అందలేదు. ప్రభుత్వం కమీషన్ డబ్బులు ఇచ్చి వీవోలను ఆదుకోవాలి. నిర్వహణకు ఇబ్బంది పడుతున్నాం.
– సరిత, గ్రామైక్య సంఘం, పోతుగల్


