ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీ చేయాలని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. కోడిగుడ్ల పరిమాణం, నాణ్యతను పరిశీలించారు. హబ్ కోఆర్డినేటర్ రోజా, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో సత్తయ్య, ఈవో వనిత, సర్పంచ్ ఎలగందుల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
కిశోర బాలికల సంరక్షణ అందరి బాధ్యత
కిశోర బాలికల సంరక్షణ అందరి బాధ్యత అని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం అన్నారు. ముస్తాబాద్ మండలం పోతుగల్‌లో బాలల భద్రత, డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాలను నిర్వహించగా, ఆయన పాల్గొని మాట్లాడారు. ఒకటి నుంచి 18 ఏళ్ల లోపు బాలికల తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలన్నారు. తల్లిదండ్రుల సత్ప్రవర్తన, క్రమశిక్షణపైనే బాలికల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ, తహసీల్దార్ ఫారూక్, ఎంపీడీవో లచ్చాలు, ఏఎస్సై ఘనీ, సీడీపీవో ఉమారాణి, షీటీం ఇన్‌చార్జి ప్రమీల, సఖీ ఇన్‌చార్జి రోజా, సూపర్‌వైజర్ అనూష, ఉపసర్పంచ్ కృష్ణ, కాంగ్రెస్ ఎన్‌ఆర్‌ఐ సెల్ జిల్లా అధ్యక్షుడు ధర్మేందర్, శ్రీనివాస్, రాజు, వెంకట్‌రావు పాల్గొన్నారు.


