డ్రగ్స్‌ దుష్ప్రభావాలపై ప్రచారం చేయాలి | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ దుష్ప్రభావాలపై ప్రచారం చేయాలి

Apr 29 2026 8:42 AM | Updated on Apr 29 2026 8:42 AM

సిరిసిల్ల: డ్రగ్స్‌, మాదకద్రవ్యాల వినియోగంతో దుష్ప్రభావాలపై జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేయాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సెలింగ్‌ అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో డీ అడిక్షన్‌ కౌన్సెలింగ్‌ కేంద్రం ప్రారంభించామని, డ్రగ్స్‌ బాధితులకు చికిత్స, కౌన్సెలింగ్‌ అందిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఏఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ, డ్రగ్స్‌, గంజాయి వల్ల కలిగే నష్టాలపై పోలీస్‌, ఎకై ్సజ్‌, విద్య, వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రచారం చేస్తున్నామన్నారు. వివిధ షాపులలో నిరంతరం ఆకస్మిక తనిఖీలు చేస్తున్నామని ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ అనూష పేర్కొన్నారు. సిరిసిల్ల ఆర్డీవో సీహెచ్‌ వెంకటేశ్వర్లు, ఎకై ్సజ్‌ అధికారి శ్రీనివాసరావు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ కమిషనర్లు ఖదీర్‌పాషా, సంపత్‌కుమార్‌, జిల్లా వైద్యాధికారి రజిత, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌ బేగం, కార్మికశాఖ అధికారి నజీర్‌అహ్మద్‌, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు ప్రవీణ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement