ఎండలో పనులు చేయాలి. కనీసం టెంట్ సౌకర్యం లేదు. నీళ్లు కూడా లేవు. ఇంటి నుంచే నీళ్లు తెచ్చుకుంటున్నాం. ఆ నీళ్లు పని పూర్తయ్యే వరకు సరిపోవడం లేదు. దప్పికతోనే పని చేస్తున్నాం. అధికారులు స్పందించి పనిప్రదేశాల్లో చలువ పందిర్లు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందించాలి.
– దాదే ప్రమీల, ఉపాధిహామీ కూలి
సౌకర్యాలు కల్పిస్తున్నాం
ప్రస్తుత వేసవిలో ఉపాధిహామీ పనులు చేసే కూలీలకు పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పిస్తున్నాం. కొన్ని గ్రామాల్లో తప్ప అంతటా చలువపందిర్లు వేశాం. అందుబాటులో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లను ఉంచుతున్నాం. నీటిబాటిళ్లను కూలీలు ఇంటి నుంచి తెచ్చుకోవాలని సూచిస్తున్నాం. ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా పరిష్కరిస్తాం.
– కొమురయ్య, ఏపీవో, ఎల్లారెడ్డిపేట


