అంతిమ సంస్కారాలకు వాగే దిక్కు | - | Sakshi
Sakshi News home page

అంతిమ సంస్కారాలకు వాగే దిక్కు

Apr 27 2026 8:18 AM | Updated on Apr 27 2026 8:18 AM

● శాత్రాజుపల్లిలో 1, 2 వార్డులుగా విభజించారు. ఆ గ్రామంలో శ్మశానవాటిక నిర్మించినప్పటికీ సౌకర్యాలు లేవు. ● అయ్యోరుపల్లిని 3వ వార్డుగా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు శ్మశానవాటిక నిర్మించలేదు. సొంత స్థలాల్లోనే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. నిరుపేదలకు గంజివాగే దిక్కుగా మారింది. ● నాంపల్లి గ్రామాన్ని 5, 6 వార్డులుగా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు శ్మశానవాటిక నిర్మించలేదు. ● తిప్పాపూర్‌ను 7, 8 వార్డులుగా ఏర్పాటు చేశారు. ఎవరైనా మరణిస్తే మూలవాగులోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ● కోనాయపల్లిని 13వ వార్డుగా ఏర్పాటు చేశారు. స్థలాల కొరతతో శ్మశానవాటికను ఏర్పాటు చేయలేదు. ● బాలానగర్‌, లాలపల్లి, లక్ష్మీపురం ప్రాంతాల్లోనూ శ్మశానవాటికలు లేవు.

ప్రతిపాదనల్లోనే శ్మశానవాటికలు

విలీన గ్రామాలపై చిన్నచూపు

పట్టించుకోని పాలకులు

వేములవాడరూరల్‌: ఆధ్యాత్మిక పట్టణం వేములవాడ మున్సిపాలిటీలో విలీన గ్రామాల్లో అంతిమసంస్కారాలకు అవస్థలు తప్పడం లేదు. శ్మశానవాటికలు అందుబాటులో లేక మూలవాగు, గంజివాగులు దిక్కవుతున్నాయి. మున్సిపాలిటీలో ఏడేళ్ల క్రితం నాంపల్లి, తిప్పాపూర్‌, కోనాయపల్లి, శాత్రాజుపల్లి, అయ్యోరుపల్లి ఐదు గ్రామాలను కలిపారు. అప్పటి నుంచి ఆయా గ్రామాల్లో శ్మశానవాటికల పనులు పూర్తి చేయలేదు.

స్థలాలు కరువు

మరణిస్తే అవస్థలే..

మా గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయొద్దని ఆందోళనలు చేపట్టాం. అయినా విలీనం చేశా రు. 3వ వార్డుగా ఏర్పాటు చేసినప్పటికీ కనీసం శ్మశానవాటిక ఏర్పాటు చేయలేదు. ఎవరైనా మరణిస్తే సొంత స్థలాలు లేదా గంజివాగులోనే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నాం. – ఉల్లెందుల అంజయ్య,

అయ్యోరుపల్లి మాజీ సర్పంచ్‌

వేములవాడ పట్టణంలోని మూడోవార్డులో విలీనమైన లక్ష్మీపురంలో చిట్యాల చంద్రయ్య శనివారం అనారోగ్యంతో మృతి చెందాడు. అంతిమ సంస్కారాల కోసం మృతదేహాన్ని ఆ ప్రాంతంలో ఉన్న శ్మశానవాటిక వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఎలాంటి పనులు ప్రారంభించలేదు. స్థలాన్ని గుర్తించి ప్రహరీ మాత్రమే ఏర్పాటు చేశారు. అందులో పిచ్చిమొక్కలు పెరిగి వెళ్లడానికి వీలు లేకుండా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబసభ్యులు బయట ప్రాంతంలోనే దహన సంస్కారాలు పూర్తిచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement