ఘనంగా వాసవీమాత జయంతి | - | Sakshi
Sakshi News home page

ఘనంగా వాసవీమాత జయంతి

Apr 27 2026 8:18 AM | Updated on Apr 27 2026 8:18 AM

సిరిసిల్ల: వాసవీ కన్యకా పరమేశ్వరీ మాతా జయంతిని ఆదివారం కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌, ఎస్పీ మహేశ్‌ బీ గీతే ముందుగా పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి రాందాస్‌, సీపీవో శ్రీనివాసాచారి, ఎస్సీ కార్పొరేషన్‌ అధికారి స్వప్న, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు బుస్స దశరథం, మాజీ అధ్యక్షుడు కటుకం సత్తయ్య, వైశ్య సంఘం ప్రతినిధులు సిద్ధంశెట్టి వేణు, అల్లాడి శ్రీనివాస్‌, కటుకం శ్రీనివాస్‌, పబ్బ నాగరాజు, రంగ రాజేందర్‌, రాజూరి వాసుదేవరాయలు, ఆర్‌ఐ యాదగిరి, ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌, ఆర్‌ఎస్‌ఐ సాయికిరణ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement