ఊరెళ్లేందుకు సిద్ధమయ్యాం. కారులో డీజిల్ పోయించేందుకు బంకుకు వస్తే నో స్టాక్ బోర్డు ఉంది. ఎప్పుడూ పద్మనగర్‌లోనే డీజిల్ పోయిస్తాం. కానీ ఈసారి నో స్టాక్ బోర్డు ఉండడంతో మరో బంకులో డీజిల్ పోయించేందుకు వెళ్తున్నాం. నమ్మకంతో ఇంత దూరం వస్తే బంక్‌లో డీజిల్, పెట్రోల్ లేదని తెలిసి నిరాశతో వెళ్తున్నాం. మేం ఒక్కరిమే కాదు.. చాలా మంది ట్రాక్టర్లు, బైక్‌ల యజమానులు వాపస్ పోతున్నారు.
– పిల్లి కిశోర్, సారంపల్లి
పెట్రోల్ కోసం వచ్చాను
బండిలో పెట్రోల్ పోయించేందుకు వస్తే నో స్టాక్ బోర్డు ఉంది. బంకులోకి వాహనాలు రాకుండా అడ్డంగా తాడు కట్టారు. మూడు రోజులుగా ఇదే పరిస్థితి. బంకు ఉందనే నమ్మకంతో వస్తే ఇలా లేకుంటే ఎలా. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. వాహనదారులు పెట్రోల్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.
– పయ్యావుల లక్ష్మణ్, తంగళ్లపల్లి


