ఇల్లంతకుంట: మండలంలోని జవారిపేట పల్లె దవాఖానా అద్దె భవనంలో కొనసాగుతోంది. భవనంలోని గోడలు కూలిపోవడంతో అందులోని సా మగ్రి రెడ్డి సంఘం భవనంలోని గదిలో, పాల ఉత్పత్తిదారుల సంఘం భవనంలోకి ఫర్నిచర్, ఇతర సామగ్రిని సిబ్బంది తరలించారు. ఇరుకు గదుల్లోనే వైద్యసేవలు అందిస్తున్నారు. సిబ్బంది సౌకర్యాలు కల్పించకపోవడంతో విధులు నిర్వర్తించేందుకు ఇ బ్బంది పడుతున్నారు. జవారిపేటపల్లె దవాఖాన కేంద్రం పరిధిలో పొత్తూరు, నర్సక్కపేట, గ్రామాలున్నాయి. పల్లె దవాఖానాలో ఎంఎల్‌హెచ్‌పీ డాక్టర్, ఇద్దరు ఏఎన్‌ఎంలు, నలుగురు ఆశా కార్యకర్తలున్నారు.
నిరుపయోగంగా భవనం
జవారిపేట గ్రామంలో నూతనంగా పల్లె దవాఖాన భవనాన్ని నిర్మించి రెండేళ్లు గడుస్తున్నా విద్యుత్, నీటి సౌకర్యం, లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. నూతన భవనంలో అసంపూర్తి పనులు పూర్తిచేసి పల్లె దవాఖానను నూతన భవనంలోకి మార్చాలని ప్రజలు కోరుతున్నారు.


