రామగుండం: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామ శివారులోని చెరువుకట్ట సమీపంలో నివాసముండే బుడిగజంగాల కుటుంబానికి చెందిన పస్తం పవన్(18) శనివారం ఈతకొడుతుండగా పిట్స్ రావడంతో నీటమునిగి చనిపోయాడు. మరోఇద్దరు యువకులతో కలిసి చెరువులో ఈదుతుండగా పిట్స్ వచ్చినట్లు స్థానికులు తెలిపారు. యువకుడు కొన్నేళ్లుగా పిట్స్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా పస్తం రాంచందర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు పవన్ ఉన్నాడు. రాంచందర్‌కు ఉన్న ఏకై క కుమారుడు పవన్ మృత్యువాత పడడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై వెంకటస్వామి తెలిపారు.
జగిత్యాలక్రైం: బీర్‌పూర్ మండలకేంద్రంలో ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో అదేగ్రామానికి చెందిన చీర్నేని బుచ్చన్నకు తీవ్రగాయాలయ్యాయి. బుచ్చన్న తన ద్విచక్ర వాహనంపై పొలం పనులకు వెళ్తుండగా.. జన్నారం నుంచి జగిత్యాలకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో బుచ్చన్న తలకు తీవ్రగాయాలుకాగా.. స్థానికులు 108 ద్వారా జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బీర్‌పూర్ ఎస్సై రాజు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాలకు చెందిన బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై పోక్సో, కిడ్నాప్, అత్యాచారం కేసులు నమోదు చేసి నింది తుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. హౌసింగ్‌బోర్డు కాలనీలో ని వాసముంటున్న మనువాడ విష్ణువర్దన్ కొద్దిరోజు ల క్రితం పట్టణానికి చెందిన ఓ బాలికను కిడ్నాప్ చే సి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యా దు మేరకు నిందితుడిని రిమాండ్‌కు పంపించినట్లు సీఐ తెలిపారు.
దాడి చేసిన వ్యక్తి రిమాండ్
చందుర్తి(వేములవాడ): పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని దాడిచేసిన చందుర్తి మండలం జోగాపూర్‌కు చెందిన ఓ వ్యక్తిని శనివారం అరెస్టు చేసినట్లు ఎస్సై జిల్లెల్ల రమేశ్ తెలిపారు. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాలు. చందుర్తి మండలం జోగాపూర్‌కు చెందిన గొంటి లక్ష్మణ్ రోడ్డుపై వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన నామాల ఉరఫ్ మ్యాదరి నర్సయ్య ఈనెల 5న గొడ్డలి కామతో దాడి చేశాడు. బాధితుడు లక్ష్మణ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.
దొంగతనం కేసులో వ్యక్తి అరెస్టు
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల పరిధిలోని పలు ఆలయాలు, ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎల్లారెడ్డిపేట సీఐ వెంకటేశ్ తెలిపారు. గంభీరావుపేట మండలకేంద్రానికి చెందిన అక్కపల్లి సంతోష్‌ను రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.
రోడ్డుపై కందకాలు..
ఇల్లంతకుంట: మండలకేంద్రం నుంచి కరీంనగర్ వెళ్లే ప్రధాన రహదారి పొత్తూరు సమీపంలోని రోడ్డుకు అడ్డంగా కందకాలు ఉండడంతో ప్రయాణికులు ప్రమాదాలబారిన పడుతున్నారు. కందకం దగ్గరకు వచ్చేంతవరకు తెలియకపోవడంతో ప్రమాదాలబారిన పడుతున్నామని వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. పొత్తూ రు రోడ్డుపై రెండు మూడుచోట్ల కందకాలు న్నాయి. ఆర్‌అండ్‌బీ అధికారులు మరమ్మతులు చేపట్టి ప్రమాదాలబారిన పడకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.


