మిషన్‌ భగీరథ ఉన్నా బోరు నీరే | - | Sakshi
Sakshi News home page

మిషన్‌ భగీరథ ఉన్నా బోరు నీరే

Apr 26 2026 5:03 AM | Updated on Apr 26 2026 5:03 AM

కోట్లు కుమ్మరించినా తీరని దాహం పైప్‌లైన్లు ఉన్నా అందని స్వచ్ఛమైన నీరు మళ్లీ పాత పద్ధతిలోనే బోర్లు, ట్యాంకర్లు ఆర్వో ప్లాంట్ల బాట పడుతున్న గ్రామస్తులు

వీర్నపల్లి(సిరిసిల్ల): గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీమిషన్‌ భగీరథశ్రీ పథకం లక్ష్యం పక్కదారి పడుతోంది. ఇంటింటికీ స్వచ్ఛమైన సురక్షిత జలాలు అందించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి పైప్‌లైన్లు వేసినప్పటికీ అనేక గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీరు అందడం లేదు.

కలుషిత నీరే దిక్కు

గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీరు సకాలంలో రాకపోవడంతో స్థానిక ప్రజాప్రతినిధులు మళ్లీ పాత పద్ధతులనే ఆశ్రయిస్తున్నారు. పాతబోర్ల ద్వారా వచ్చే నీటిని, మిషన్‌ భగీరథ నీటిని కలిపి వాటర్‌ ట్యాంకులకు ఎక్కించి సరఫరా చేస్తున్నారు. దీంతో పైప్‌లైన్‌ ద్వారా వచ్చే నీరు పూర్తిగా కలుషితమవుతోంది. ఇంటింటికీ శుద్ధి చేసిన నీరు అందిస్తామన్న హామీ నీటిమూటగానే మిగిలిపోయింది. రక్షిత తాగునీరు రాకపోవడంతో ప్రజలు గత్యంతరం లేక ఈ శ్రీమిక్సింగ్‌శ్రీ నీటినే వాడుకోవాల్సి వస్తోంది.

జేబుకు చిల్లు.. ఆరోగ్యానికి ముప్పు

ప్రభుత్వ నీటిపై నమ్మకం లేక గ్రామస్తులు అదనపు భారమైనా సరే ప్రైవేటు ఆర్వో ప్లాంట్లను ఆశ్రయిస్తున్నారు. రూ.10 వెచ్చించి 20 లీటర్ల నీటిని కొనుగోలు చేస్తున్నారు.

మళ్లీ ట్యాంకర్ల కాలం

వేసవి సమీపిస్తున్న తరుణంలో నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాల్సిన అధికారులు మిషన్‌ భగీరథ నిర్వహణను గాలికి వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో సర్పంచులు కొత్తగా బోర్లు వేయించడం, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. పైప్‌లైన్ల లీకేజీలు, మోటార్ల మరమ్మతులపై పర్యవేక్షణ కరువైందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, మిక్సింగ్‌ నీటి సరఫరాను అరికట్టి, స్వచ్ఛమైన భగీరథ జలాలను అందించాలని పల్లె ప్రజలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement