సిరిసిల్ల: మండుతున్న ఎండల్లో పశువులు, పక్షులు తాగునీటి కోసం అలమటిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో పశువులకు, పక్షులకు తాగునీరు లభిస్తుంది. కానీ పట్టణ ప్రాంతాల్లో విలవిల్లాడుతున్నాయి. సిరిసిల్లలోని శ్రీసెస్‌శ్రీ ఆఫీస్ పక్కన చికెన్ సెంటర్ నిర్వాహకుడు బైరగోని వెంకన్నగౌడ్ తన షాపు ముందుకు వచ్చే ఆవులు, ఎద్దులకు ఇలా నీళ్లు పెడుతుంటాడు. ఓ గిన్నెతో ఐదారు సార్లు వాటి దాహం తీరే వరకు నీళ్లు పట్టి పెట్టడం విశేషం. ఎండాకాలంలో పశువుల తాగునీటి ఇబ్బందులకు ఈ దృశ్యం అద్దం పడుతుంది. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు పశువులకు తాగునీటి తొట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.


