కరీంనగర్: ఆడపిల్ల పుడితే భారమనే వివక్షను వీడి, లక్ష్మిదేవిలా భావించినప్పుడే సమాజంలో లింగనిష్పత్తి తేడాలు తొలగుతాయని జిల్లా అదనపు, సెషన్స్ జడ్జి నీరజ అన్నారు. కరీంనగర్‌లో రోహన్ ఆసుపత్రి ప్రారంభించి 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ‘దేవిపుత్రిక’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ఆడపిల్ల పుడితే నార్మల్ డెలివరీ అయినా, సిజేరియన్ అయినా సంవత్సరం పాటు పూర్తిగా ఉచిత వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు ఎనమల్ల శ్రీదేవి, ఎనమల్ల నరేశ్ ముందుకొచ్చారు. శనివారం ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బీఎన్ రావుతో కలిసి ‘దేవిపుత్రిక’ పోస్టర్ ఆవిష్కరించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమాజంలో ఆడపిల్లల విషయంలో ఉన్న వివక్షను తొలగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని నిర్వాహకులు తెలిపారు.
జిల్లా అదనపు, సెషన్స్ జడ్జి నీరజ


