ఉమ్మడి జిల్లాలో జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్ల బదిలీ | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాలో జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్ల బదిలీ

Apr 25 2026 9:12 AM | Updated on Apr 25 2026 9:12 AM

జగిత్యాలజోన్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పలు కోర్టుల్లో పనిచేస్తున్న జ్యుడీషియల్‌ మెజి స్ట్రేట్‌లను బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్‌లో పనిచేస్తున్న షీరీనాను రంగారెడ్డి జిల్లా ఎల్‌బీనగర్‌, జగిత్యాలలో పనిచేస్తున్న శ్రీనిజ కోహిర్కర్‌ను పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, మెట్‌పల్లిలో పనిచేస్తున్న ఎన్‌.అరుణ్‌కుమార్‌ను రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌, వేములవాడలో పనిచేస్తున్న కె.జ్యోతిర్మయిని ఖమ్మం, సిరి సిల్లలో పనిచేస్తున్న ఎ.ప్రవీణ్‌ను ఖమ్మం, గో దావరిఖనిలో పనిచేస్తున్న డి.వెంకటేశ్‌ను గ ద్వాలకు బదిలీ చేశారు. ఖమ్మంలో పనిచేస్తు న్న మాధవిని మెట్‌పల్లి, రంగారెడ్డి జిల్లా ఇ బ్రహీంపట్నంలోని యశ్వంత్‌సింగ్‌ను కరీంనగర్‌, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో పనిచేస్తున్న అపర్ణను పెద్దపల్లి జిల్లా మంథనికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

నేడు కేటీఆర్‌ పర్యటన

తంగళ్లపల్లి(సిరిసిల్ల): బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్‌ శనివారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. తంగళ్లపల్లి మండలంలోని రామన్నపల్లెలో మధ్యాహ్నం 3:30 గంటలకు, తంగళ్లపల్లి పెద్దమ్మ పెద్దిరాజుల కల్యాణానికి 4:30, సాయంత్రం 5:30 గంటలకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కేసీఆర్‌ కప్‌ విజేతలకు బహుమతులు అందజేస్తారు.

సీఎం ఇంటికి పాదయాత్ర

సిరిసిల్లటౌన్‌: విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్స్‌, ఫీజు బకాయిలు విడుదల చేయాలని కోరుతూ సీఎం ఇంటికి పాదయాత్ర చేస్తున్నట్లు ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కుర్ర రాకేశ్‌, మంద అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. సిరిసిల్లలోని కార్మిక భవనంలో ఈనెల 28న చేపడుతున్న కార్యక్రమ పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఫీజులపై హైకోర్టు తీర్పును పునర్‌ సమీక్షించాలని కోరారు. 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అదే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎత్తివేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. నాయకులు బర్రెంకల శ్రీహరిక, పెండెల ఆదిత్య, శశికుమార్‌, వంశీ పాల్గొన్నారు.

సహకార బ్యాంక్‌ ఉద్యోగుల ధర్నా

ముస్తాబాద్‌(సిరిసిల్ల): ముస్తాబాద్‌లో కేంద్ర సహకార బ్యాంక్‌ ఎదుట భోజన విరామ సమయంలో ఉద్యోగులు శుక్రవారం ధర్నా చేపట్టారు. బ్యాంక్‌ మేనేజర్‌ సురభి ప్రవీణ్‌రావు మాట్లాడుతూ సహకార బ్యాంక్‌ ఉద్యోగులకు ఇచ్చిన ఇన్సెంటీవ్స్‌ను ప్రభుత్వం రికవరీ చేసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం సరికాదన్నారు. గత రెండేళ్లలో ఎంతో మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ చెందారని గుర్తు చేశారు. ప్రభుత్వం, సహకారశాఖ, నాబార్డు తీసుకున్న నిర్ణయాలతో ఉద్యోగులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రభుత్వం పునారలోచన చేయాలని కోరారు.

కూలీ పెంచేలా చర్యలు తీసుకోండి

సిరిసిల్లటౌన్‌/సిరిసిల్లఅర్బన్‌: పాలిస్టర్‌ వస్త్రానికి సంబంధించి పవర్‌లూమ్‌ కార్మికులకు, ఆసాములకు, వార్పిన్‌, వైపని కార్మికులకు కూలీ పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరినట్లు జిల్లా పవర్‌లూమ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు కోడం రమణ తెలి పారు. కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ను కలిసి వినతిపత్రం అందించారు. కూలీ ఒప్పందం ముగిసి రెండేళ్లు గడిచినా కొత్త కూలీ ఒప్పందం చేయడం లేదన్నారు. ఈమేరకు యజమానుల సంఘానికి పలు మార్లు వినతిపత్రాలు అందించినా స్పందించడం లేదన్నారు. ఈనేపథ్యంలో ఈనెల 27 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. మూశం రమేశ్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement