వేములవాడ: మహిళల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పేర్కొన్నారు. పట్టణంలోని 7, 8 వార్డులలో అసంపూర్తిగా ఉన్న భవనాలను శుక్రవారం పరిశీలించారు. గతంలో ఈ భవనాల పనులు ప్రారంభమైనప్పటికీ వివిధ కారణాలతో మధ్యలోనే నిలిచిపోయాయన్నారు. కౌన్సిలర్లు ఎల్ల శ్రీనివాస్, మైలారం శ్రీనివాస్‌లతో కలిసి భవన నిర్మాణ పురోగతిని, మిగిలి ఉన్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణం పనులకు అవసరమైన నిధులను త్వరలోనే మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఏఈ అనన్య తదితరులు పాల్గొన్నారు.


