ఆర్టీసీ డ్రైవర్‌ది ప్రభుత్వ హత్యే | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ డ్రైవర్‌ది ప్రభుత్వ హత్యే

Apr 25 2026 9:12 AM | Updated on Apr 25 2026 9:12 AM

కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి మూడోరోజు నిరవధిక సమ్మె సిరిసిల్ల బస్టాండులో సంతాప సభ కార్మికులకు బీఆర్‌ఎస్‌, బీజేపీ, కార్మిక సంఘాల సంఘీభావం

సిరిసిల్లలో ఆర్టీసీ డ్రైవర్‌కు నివాళి అర్పిస్తున్న

బీజేపీ, ఏఐటీయూసీ నాయకులు

శంకర్‌గౌడ్‌ సంతాపసభలో

బీఆర్‌ఎస్‌ నేతలు ఆగయ్య, చక్రపాణి

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమాదేవి

సిరిసిల్లటౌన్‌/వేములవాడఅర్బన్‌: డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ది కాంగ్రెస్‌ ప్రభుత్వ హత్యగా బీఆర్‌ఎస్‌, బీజేపీ, కార్మిక సంఘాల పార్టీల నాయకులు విమర్శించారు. సిరిసిల్ల కొత్తబస్టాండులో శుక్రవారం నిర్వహించిన శంకర్‌గౌడ్‌ సంతాపసభకు హాజరై మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ దార్ల సందీప్‌ పాల్గొన్నారు.

శంకర్‌గౌడ్‌కు నివాళి

ఆర్టీసీ కార్మికుడు శంకర్‌గౌడ్‌ ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి విమర్శించారు. ఆర్టీసీ కార్మికులతోపాటు జిల్లా కేంద్రంలో సంఘీభావ ర్యాలీలో మాట్లాడారు. శంకర్‌గౌడ్‌ చిత్రపటానికి నివాళి అర్పించారు.

మూడో రోజు మిన్నంటిన నిరసనలు

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు మూడో రోజు నిరసనలు హోరెత్తించారు. కార్మిక సంఘాలు సిరిసిల్ల డిపోతోపాటు కొత్తబస్టాండ్‌, పాత బ స్టాండ్‌ ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టాయి. ఆర్టీసీ ఉద్యోగులపై ప్రభు త్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఎస్‌ ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర నాయకులు కాళిదాసు, రీజినల్‌ వైస్‌చైర్మన్‌ కొమురయ్య, డిపో అధ్యక్షుడు సీహెచ్‌.బాణయ్య, ఉపాధ్యక్షులు జే.ఎస్‌.ఎన్‌.రావు, శ్రీనివాస్‌నాయక్‌, ప్రశాంత్‌, సుమలత, రాంప్రసాద్‌ పాల్గొన్నారు.

సొమ్మసిల్లి పడిపోయిన కార్మికురాలు

తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ వేములవాడ ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట శుక్రవారం మౌ న దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చి న హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఆర్టీసీ కార్మికులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందన్నారు. మౌన దీక్షలో కండక్టర్‌ రమాదేవి అస్వస్తతకు గురై కిందపడిపోయారు. వెంటనే వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమెను బీఆర్‌ఎస్‌ నాయకులు పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement