రైస్‌మిల్లులో అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

రైస్‌మిల్లులో అగ్నిప్రమాదం

Apr 25 2026 9:12 AM | Updated on Apr 25 2026 9:12 AM

గన్నీ సంచులు దగ్ధం రూ.20లక్షల ఆస్తి నష్టం షార్ట్‌సర్క్యూట్‌తోనే ప్రమాదం

ఇల్లంతకుంట(మానకొండూర్‌): షార్ట్‌ సర్క్యూట్‌తో ప్రమాదం ఏర్పడి రూ.20 లక్షల విలువైన గన్నీ బ్యాగులు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు, మిల్లు ఆపరేటర్‌ రజినీష్‌ తెలిపిన వివరాలు. మండలంలోని రహీంఖాన్‌పేటలోని వరలక్ష్మి రైస్‌మిల్లులో శుక్రవారం మధ్యాహ్నం కరెంటు సరఫరా లేదు. సాయంత్రం ట్రాన్స్‌ఫార్మర్‌ ఫీజు వేయగానే లైట్లు వచ్చాయి. ఆ సమయంలోనే రైసుమిల్లులోని కిటికీల ద్వారా మంటలు కనిపించాయి. వెంటనే షట్టర్‌ తెరిచి చూడగా అప్పటికే గన్నీ బ్యాగులు మంటల్లో కాలిపోతున్నాయి. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేవు. దీంతో ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా రాత్రి 9:30 గంటలకు మిల్లు వద్దకు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే 30 వేల గన్నీ బ్యాగులు కాలిపోయాయి. వీటిని రెండు రోజుల క్రితమే తెప్పించారు. ఫైర్‌స్టేషన్‌ ఆఫీసర్‌ నరేందర్‌, లీడింగ్‌ ఫైర్‌ ఫైటర్‌ నరసింహచారి, ఫైర్‌ సిబ్బంది గడ్డమీది సాయి, గణేశ్‌ మంటలను ఆర్పివేశారు. ప్యాడీ కూడా స్వల్పంగా కాలిపోయింది. సకాలంలో ఫైరింజన్‌ చేరుకొని మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. సంఘటన స్థలానికి ఇల్లంతకుంట పోలీసులు వచ్చి సమాచారం సేకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement