సిరిసిల్ల అర్బన్: బీఆర్‌ఎస్ మాజీ మంత్రుల అరెస్టుకు నిరసనగా బీఆర్‌ఎస్వీ నాయకులు సిరిసిల్ల నేతన్నచౌక్ వద్ద శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌లను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పడానికి వెళ్లిన ప్రజాప్రతినిధులపై ఇలాంటి చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. వినయ్‌కుమార్, కిరణ్, ప్రవీణ్, శేఖర్, హైదర్, శశి, రాజు పాల్గొన్నారు.
రైస్‌మిల్లర్లు ధాన్యం త్వరగా దించుకోవాలి
వేములవాడఅర్బన్/బోయినపల్లి: ధాన్యం లోడ్‌తో వచ్చిన వాహనాలను ఆలస్యం చేయకుండా దింపుకోవాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ రైస్‌మిల్లర్లకు సూచించారు. వేములవాడ మండలం అనుపురం, బోయినపల్లి మండలం విలాసాగర్, జగ్గారావుపల్లి, కొదురుపాకలోని కొనుగోలు కేంద్రాలు పరిశీలించారు. విలాసాగర్‌లోని రైస్‌మిల్లులను తనిఖీ చేశారు. రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. తహసీల్దార్ ఎండీ.షరీఫ్ మొయినొద్దీన్ ఉన్నారు.


