● సిరిసిల్ల ఏఎంసీ చైర్‌పర్సన్ వెల్ముల స్వరూపారెడ్డి
సిరిసిల్లటౌన్: రైతుల పండుగలో హుందాగా ప్రవర్తించాల్సింది పోయి రాజకీయకక్షతో అనవసరపు రాద్దాంతం చేయడం సరికాదని బీఆర్‌ఎస్ నేతలపై ఏఎంసీ చైర్‌పర్సన్ వెల్ముల స్వరూపారెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ప్రెస్‌మీట్లో మాట్లాడారు. రెండు రోజుల క్రితం వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య జరిగిన గొడవకు బీఆర్‌ఎస్ నేతలే కారణమన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌కు తాము గౌరవం ఇచ్చామని కానీ వారు రాజకీయ దురుద్దేశ్యంతోనే తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకోవాలని హితవు పలికారు. మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ నేరెళ్ల నర్సింగంగౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, కూరపాటి శ్రీశైలం, ఎలుక తిరుపతి, దుబాల వెంకటేశం, మార్గం లక్ష్మణ్, బూర దశరథం, పిస్క మధు, ఆడెపు జగన్, ఖాజా, కోడం అరుణ తదితరులు పాల్గొన్నారు.


