● కలెక్టర్ గరీమా అగ్రవాల్
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పంటకు మద్దతు ధర లభిస్తుందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. మండలంలోని గోపాలరావుపల్లెలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. కేంద్రంలో రైతులకు కల్పించిన వసతులను పరిశీలించారు. నిర్వాహకులతో మాట్లాడి ధాన్యం సేకరణ, గన్నీ బ్యాగుల నిల్వ తదితర వివరాలు ఆరా తీశారు. కొనుగోలు కేంద్రం వద్ద పూర్తి వివరాలతో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శించాలి. జిల్లా పౌరసరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, తహసీల్దార్ విజయప్రకాశ్‌రావు, ఏపీఎం చంద్రయ్య, ఏవో సంజీవ్ పాల్గొన్నారు.


