బాలల హక్కులను రక్షిస్తేనే భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

బాలల హక్కులను రక్షిస్తేనే భవిష్యత్‌

Apr 24 2026 6:26 AM | Updated on Apr 24 2026 6:26 AM

చందుర్తి(వేములవాడ): బాలల హక్కులను రక్షిస్తేనే వారి భవిష్యత్‌ను బలంగా నిర్మించవచ్చునని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు మర్రిపల్లి చందన అభిప్రాయపడ్డారు. మండలంలోని సనుగుల గంగిరెద్దులకాలనీని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు, సంకల్ప ఫౌండేషన్‌ డైరెక్టర్‌ రోజి గురువారం సందర్శించారు. దత్తత తీసుకున్న గంగిరెద్దుకాలనీలో పలు అభివృద్ధి, బాలల సంక్షేమానికి పలు కార్యక్రమాలు చేపట్టారు. కాలనీలోని పిల్లలకు 50 రోజులపాటు విద్యాబోధనకు టీచర్‌ను, పిల్లల వ్యక్తిగత పరిశుభ్రతకు బార్బర్‌ను ఏర్పాటు చేశారు. మహిళల ఉపాధి కోసం కుట్టుశిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సంకల్ప ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గంగిరెద్దులకాలనీలోని సుమారు 100 మంది పిల్లలకు బట్టలు, చెప్పులు, టూత్‌పేస్టులు, సబ్బులు తదితర వస్తువులు అందజేశారు. సర్పంచ్‌ బొడిగే లావణ్య–అనిల్‌గౌడ్‌, జిల్లా శిశు మహిళ సంక్షేమాధికారి లక్ష్మీరాజం, వెల్ఫేర్‌ కమిటీ సభ్యులు అంజయ్య, డీసీపీవో కవిత, ఏసీడీపీవో సుచరిత, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.

క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

సిరిసిల్ల అర్బన్‌: జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామీణ ప్రాంతాల్లోని 10 కేంద్రాల్లో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు అనుభవం గల వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్‌ కోచ్‌లు, జాతీయ క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి రాందాస్‌ తెలిపారు. అథ్లెటిక్స్‌, కరాటే, యోగా, వాలీబాల్‌, హ్యాండ్‌బాల్‌, నెట్‌బాల్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌, ఆర్చరీ, కబడ్డీ, ఖోఖో, పట్టణ స్థాయి మినీస్టేడియంలో అథ్లెటిక్స్‌, కరాటే, యోగా, వాలీబాల్‌, క్రికెట్‌, టేబుల్‌ టెన్నిస్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌, ఆర్చరీ, కబడ్డి, ఖోఖో, బాస్కెట్‌బాల్‌, క్యారం, చెస్‌ క్రీడలలో శిక్షణకు ఈనెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా అందజేయాలని సూచించారు. వివరాల కోసం 94402 39783, 75692 07411లో సంప్రదించవచ్చని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement