‘సాక్షి’ కథనంతో కలిగిన భరోసా పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం రాజీకి వస్తున్న అధికారి ఉన్నతాధికారులకు చెప్పకుండానే సెలవు !
వేములవాడరూరల్: కలెక్టరేట్ కార్యాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు వద్ద ఓ ఉద్యోగి డబ్బులు వసూలు చేసిన వైనంపై గురువారం శ్రీసాక్షిశ్రీలో కథనం ప్రచురితం కావడంతో తీవ్ర చర్చకు దారితీసింది. పంచాయతీరాజ్‌శాఖలో ఉన్నత స్థానంలో పనిచేసే ఓ అధికారి ‘ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా’ అనే కథనం ప్రచురితమైంది. అధికారికి డబ్బులు ఇచ్చి మోసపోయిన బాధితులు పలువురు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సదరు ఉద్యోగి వారితో రాజీ కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గురువారం కార్యాలయానికి బాధితులు వస్తున్నట్లు తెలుసుకున్న ఉద్యోగి రెండు రోజులపాటు సెలవు పెట్టినట్లు తెలిసింది. సదరు ఉద్యోగి బాధితులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ఈ ఉద్యోగి గతంలో మరొక ప్రాంతంలో విధులు నిర్వహించినప్పుడు కూడా ఇలాంటి మోసానికి పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సదరు ఉద్యోగిపై పూర్తి విచారణ చేపట్టి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.


