● బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.జీవన్‌రెడ్డి
సిరిసిల్ల: ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఎన్నికల హా మీలు అమలు చేయడంతో విఫలమైందని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో గురువారం బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. కల్యాణలక్ష్మీకి తులం బంగారం రాలేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేదని, సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదని, రైతు భరోసా ఇవ్వడం లే దని, పింఛన్లు పెంచలేదన్నారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రిపేరుకు సంబంధించి భూసారపరీక్షలు కూడా రేవంత్‌రెడ్డి చేయించలేద ని ఆరోపించారు. కొండూరి రవీందర్‌రావు, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పార్టీ నాయకులు గూడూరి ప్రవీణ్, జిందం కళాచక్రపాణి, న్యాలకొండ అరుణ, సిద్ధం వేణు, దార్ల సందీప్, కుంబాల మల్లారెడ్డి, ఏనుగు తిరుపతిరెడ్డి, అంజిరెడ్డి, రాఘవరెడ్డి, గజభీంకార్ రాజన్న పాల్గొన్నారు.


