వేములవాడ: రాజన్న ఆలయ అభివృద్ధికి హైదరాబాద్‌కు చెందిన నీలారపు పద్మజ–శివకుమార్ దంపతులు రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించారు.
చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
సిరిసిల్ల అర్బన్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్ కోరారు. జిల్లా గ్రంథాలయంలో గురువారం ఏర్పాటు చేసిన ఇండోర్ క్రీడా పోటీలను డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, గడ్డం నర్సయ్య, సూర దేవరాజు పాల్గొన్నారు.


