● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడరూరల్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడరూరల్ మండలం ఎదురుగట్ల, లింగంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రవేశ కార్యక్రమానికి గురువారం హాజరయ్యారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని, ఉచిత విద్యుత్, ఉచిత బస్, సన్నబియ్యం, నూతన రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు వంటి ఎన్నో పథకాలను అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా విప్‌ను గృహ యజమానులు శాలువాతో సత్కరించారు. సర్పంచులు తిరుపతిరెడ్డి, రంగు వెంకటేశంగౌడ్, నాయకులు సోయినేని కరుణాకర్, రాంరెడ్డి, పొన్నం మల్లేశం, బండ శ్రీనివాస్, పాలకుర్తి పర్శరాం, సోయినేని లహరి, కడారి తిరుపతి పాల్గొన్నారు.


