ఈత సరదా విషాదంగా మారొద్దు | - | Sakshi
Sakshi News home page

ఈత సరదా విషాదంగా మారొద్దు

Apr 23 2026 8:30 AM | Updated on Apr 23 2026 8:30 AM

● మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు ● వేసవి సెలవుల్లో జాగ్రత్తగా ఉండాలి ● ఎస్పీ మహేశ్‌ బీ గీతే

● మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు ● వేసవి సెలవుల్లో జాగ్రత్తగా ఉండాలి ● ఎస్పీ మహేశ్‌ బీ గీతే

సిరిసిల్ల: వేసవి సెలవుల్లో ఈత నేర్చుకోవడానికి చెరువులు, కాలువల వద్దకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుందని, జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ మహేశ్‌ బీ గీతే కోరారు. ఈత నేర్చుకోవాలన్న సరదా విషాదం కాకుండా చూసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఈత రాని వారు బావులు, చెరువులు, కాలువల వద్దకు ఒంటరిగా వెళ్ల వద్దని, తల్లిదండ్రుల సమక్షంలోనే నేర్చుకోవాలని సూచించారు. పిల్లల కదలికలపై తల్లిదండ్రులు సైతం నిఘా పెట్టాలన్నారు. ఈత సరదాపై పోలీస్‌ శాఖ రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు.

మైనర్‌లకు

వాహనాలు ఇవ్వకండి

తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని ఎస్పీ సూచించారు. ఒక వేళ వాహనం ఇస్తే, తెలిసీ, తెలియని డ్రైవింగ్‌తో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. మైనర్‌ డ్రైవింగ్‌ చేస్తూ వాహనంతో పట్టుబడితే వాహన యజమానిపై కేసు నమోదు చేస్తారని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement