అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్‌ | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్‌

Apr 23 2026 7:24 AM | Updated on Apr 23 2026 7:24 AM

● ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ వేణుమాధవ్‌

● ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ వేణుమాధవ్‌

గంభీరావుపేట/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించడంలో ఎన్పీడీసీఎల్‌ కీలకపాత్ర పోషిస్తోందని ఎస్‌ఈ వేణుమాధవ్‌ పేర్కొన్నారు. జిల్లా సర్కిల్‌ పరిధిలో 1,427 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని రెండు అంగన్‌వాడీ కేంద్రాలకు బుధవారం విద్యుత్‌ మీటర్లు ఏర్పాటు చేశారు. డీఈ వెంకటరమణ, చంద్రమౌళి, ఏడీఈ శ్రీనివాస్‌, ఏఈ శ్రీనివాస్‌, ఆనంద్‌ పాల్గొన్నారు.

నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలి

ఎండాకాలం దృష్ట్యా వ్యవసాయానికి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని జిల్లా సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ టి.వేణు మాధవ్‌ కోరారు. ఎల్లారెడ్డిపేటలోని 132 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఆయిల్‌ లెవల్స్‌, కూలింగ్‌ సిస్టమ్‌ను ఎస్‌ఈ పరిశీలించారు. లైన్‌మెన్లు ఫీల్డ్‌లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. డివిజినల్‌ ఇంజినీర్‌ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement