● ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: కులసంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వేములవాడలో అన్ని కులసంఘాలకు నిధులు కేటాయించినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలోని రెండో బైపాస్‌రోడ్డులో మున్నూరుకాపు కల్యాణ మండపాన్ని బుధవారం మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్‌చైర్మన్ నరాల శేఖర్, మున్నూరుకాపు సంఘం నాయకులు కొండ దేవయ్య, కోయినేని బాలయ్యలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు సమానంగా చేస్తున్నట్లు వివరించారు.


