బోయినపల్లి(చొప్పదండి): సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ మహేశ్ బీ గితే ఆదేశించారు. మంగళవారం బోయినపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీఎస్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, రికార్డులను పరిశీలించారు. కేసుల దర్యాప్తులో అలసత్వం వద్దని, పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేసి, చట్టపరంగా నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మద్యం తాగి వాహనం నడపడం, మెనర్ డ్రైవింగ్ వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు వివరించాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని కోరారు. డీఎస్పీ శ్రీనివాసులు, రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై రమాకాంత్, సిబ్బంది ఉన్నారు.


