పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

Apr 22 2026 7:54 AM | Updated on Apr 22 2026 7:54 AM

సిరిసిల్లటౌన్‌: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్‌ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో అధ్యక్షుడు గుండమనేని మహేందర్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. 2024 మార్చి నుంచి రిటైర్డ్‌ అయిన 12 వేలమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సి న బకాయిలు వెంటనే విడుదల చేయాలని, ఏక మొత్తంగా రూ.10,000 కోట్లు కేటాయించి పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ చేయాలని కోరారు. సీపీఎస్‌ రద్దు చేసి, కేజీబీవీ, సమగ్ర శిక్షా ఉద్యోగులకు బేసిక్‌ పే ఇవ్వాలన్నారు. సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మే 2న యుటీఎఫ్‌ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ దాచూరి రామిరెడ్డి 10వ వర్ధంతి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్‌, కార్యదర్శి గోల్కొండ శ్రీధర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు, కోశాధికారి అంబటి రమేశ్‌, జిల్లా కార్యదర్శులు కొత్వాల్‌ ప్రవీణ్‌, పాముల స్వామి, ఆడెపు శివకుమార్‌, తిరుపతి జాదవ్‌, అరవింద్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement