వేములవాడ: రాజన్న సన్నిధిలో శంకర జయంతి మహోత్సవాలు మంగళవారం భక్తిశ్రద్ధలతో ముగిశాయి. వైశాఖ శుద్ధ పాఢ్యమి నుంచి పంచమి వరకు జరిగిన మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు మూలమూర్తులైన లక్ష్మీగణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో అభిషేకాలు చేశారు. స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం వేద సదస్సు నిర్వహించారు. నాలుగురోజులుగా జరుగుతున్న శంకర జయంతి ఉత్సవాలు ముగిసినట్లు ఆలయ స్థానాచార్యులు ఉమేశ్‌శర్మ తెలిపారు. ఈవో రమాదేవి, అర్చకులు పాల్గొన్నారు.


