● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: పోటీ పరీక్షలకు ప్రణాళికతో సిద్ధం కావాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. జిల్లా కేంద్రంలోని సినారె జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులతో కలెక్టర్ మంగళవారం మాట్లాడారు. విద్యార్హతలు, ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు? ఏయే పుస్తకాలు చదువుతున్నారని ఆరా తీశారు. అన్ని సబ్జెక్టులు ప్రణాళిక ప్రకారం ప్రతీ అంశం క్షుణ్ణంగా చదవాలన్నారు. కరెంట్ అఫైర్స్, ఇతర అన్ని అంశాలపై అవగాహనతో ముందుకెళ్లాలని పేర్కొన్నారు. ఎన్‌సీఆర్‌టీ పుస్తకాలు కూడా రిఫరెన్స్‌గా తీసుకోవాలని సూచించారు.
జనగణన పూర్తి చేయాలి
సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లు జనగణన– 2027ను బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని కలెక్టర్, డిస్ట్రిక్ట్ అండ్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. జనగణన హౌస్ లిస్టింగ్ బ్లాక్స్, సెన్సస్ మానిటరింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ విధానం, స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్)పై సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లకు శిక్షణ కొనసాగుతుండగా చివరి రోజు మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. జనగణనకు సంబంధించిన కిట్లను పంపిణీ చేశారు. మొదటి దశలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గణన నిర్వహిస్తారని, రెండో దశ ఫిబ్రవరి 2027లో వ్యక్తుల వారీగా సమాచారం సేకరిస్తారన్నారు. ప్రతీ కుటుంబం వివరాలు పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు. సీపీవో శ్రీనివాసాచారి, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, తహసీల్దార్ మహేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


