రేపటి నుంచి బస్సులు బంద్
జిల్లా ప్రయాణికులకు కష్టాలు
సిరిసిల్లటౌన్: ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. నిర్విరామంగా పరుగులు తీస్తున్న బస్సు చక్రాలకు బ్రేక్ పడనుంది. జిల్లాలోని రెండు డిపోలలో బుధవారం నుంచి బస్సులు నిలిచిపోనున్నాయి. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జిల్లా జేఏసీ సమ్మెకు సిద్ధమైంది. ఫలితంగా ఏడేళ్ల క్రితం ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణీకులు ఎదుర్కొన్న కష్టాలు మళ్లీ మొదలుకానున్నాయి.
డిమాండ్లు ఇవీ..
మేనిఫెస్టోలోని అంశాన్ని అడుగుతున్నాం
ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆర్టీసీ రెండు విభాగాలుగా విభజించారు. ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ప్రభుత్వంలో విలీనం చేశారు. ఇదే విషయాన్ని గత ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. కానీ అమలు చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే ఇక్కడి ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. విద్య, వైద్యంతోపాటు రవాణా సంస్థను సైతం లాభనష్టాలతో పరిగణించొద్దు.
– బాణయ్య, జేఏసీ చైర్మన్


