పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

Apr 21 2026 6:01 AM | Updated on Apr 21 2026 6:01 AM

రైతును రాజు చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ నామాపూర్‌లో ఇరిగేషన్‌ బంగ్లా ప్రారంభోత్సవం

ముస్తాబాద్‌(సిరిసిల్ల): పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మండలంలోని నామాపూర్‌లో ఎస్డీఎఫ్‌ నిధులు రూ.31లక్షలతో నిర్మించిన ఇరిగేషన్‌ భవనాన్ని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌తో కలిసి సోమవారం ప్రారంభించి మాట్లాడారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతులకు ఉత్తమ సేవలు అందించేందుకు నీటిపారుదలశాఖ భవనాలను నిర్మిస్తున్నామన్నారు. అనంతరం ముస్తాబాద్‌లోని కస్తూర్భా బాలికల విద్యాలయంలో నిర్వహించిన సంక్షేమ వారోత్సవాల్లో పాల్గొన్నారు. డైట్‌ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్‌ చార్జీలు 200 శాతం పెంచామని గుర్తు చేశారు. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌, స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ప్రారంభించారన్నారు.

వేణుగోపాలస్వామి ఆలయంలో పూజలు

మండడల కేంద్రంలోని పురాతన శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ధ్వజస్తంభ ప్రతి ష్ఠాపనోత్సవాల్లో విప్‌ ఆది శ్రీనివాస్‌ పాల్గొని ప్రత్యే క పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ సిరిసిల్ల ఇన్‌చార్జి మహేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్‌ సత్యనారాయణ, ఏఎంసీ చైర్‌పర్స న్‌ తలారి రాణి, ఎస్‌ఈ కిశోర్‌, ప్రత్యేకాధికారి రాఘవేందర్‌, సర్పంచ్‌లు మాదాస్‌ అనిల్‌, మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, తహసీల్దార్‌ ఫరూక్‌, ఎంపీడీవో లచ్చాలు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి, చక్రధర్‌రెడ్డి, రాజిరెడ్డి, విజయ్‌రెడ్డి, గజ్జెల రాజు, మాజీ ఎంపీపీ జనగామ శరత్‌రావు, సెస్‌ మాజీ డైరెక్టర్‌ విజయరామారావు, గజ్జెల రాజు పాల్గొన్నారు.

నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు

చందుర్తి/వేములవాడరూరల్‌: ఇళ్లు లేని నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. చందుర్తి మండలం రామన్నపేట, వేములవాడ రూరల్‌ మండలం వెంకటాంపల్లి, మర్రిపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ గృహ ప్రవేశాలకు హాజరయ్యారు. పార్టీ మండలా అధ్యక్షులు చింతపంటి రామస్వామి, వకుళాభరణం శ్రీనివాస్‌, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్‌, సనుగుల సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు ముష్కు ముకుందరెడ్డి, సర్పంచులు ఆవునూరి లక్ష్మి, ఇల్లందుల లాస్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement