అంబేడ్కర్‌ సంస్కరణలకు కాంగ్రెస్‌ తిలోదకాలు | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ సంస్కరణలకు కాంగ్రెస్‌ తిలోదకాలు

Apr 21 2026 6:01 AM | Updated on Apr 21 2026 6:01 AM

సిరిసిల్లటౌన్‌: అంబేడ్కర్‌ సంస్కరణలకు కాంగ్రెస్‌ తిలోదకాలిచ్చిందని బీజేపీ జిల్లా ఇన్‌చార్జి గంగాడి మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్లలోని బీ జేపీ జిల్లా ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన అంబేడ్కర్‌ జయంతి వారోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ అంబేడ్కర్‌ జ్ఞాపకార్థం దేశవ్యాప్తంగా స్మారక స్థలాలు అభివృద్ధి చేశారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, నాయకులు లింగంపల్లి శంకర్‌, అల్లాడి రమేశ్‌, ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీ నివాస్‌, ఉపాధ్యక్షుడు మల్లారపు సంతోష్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రాజాసింగ్‌, మహిళా మోర్చా అధ్యక్షురాలు అన్నపూర్ణ పాల్గొన్నారు.

‘డబుల్‌’ ఇళ్లు పరిశీలన

వేములవాడ/వేములవాడఅర్బన్‌: వేములవాడ మున్సిపల్‌ పరిధి తిప్పాపూర్‌లో నిర్మాణంలో ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పనులను మున్సి పల్‌ చైర్మన్‌ పుల్కం రాజు సోమవారం పరిశీలించారు. అనంతరం పట్టణంలోని బాలానగర్‌లో పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రొండి రాజుతో కలిసి ప్రారంభించారు. మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ నరాల శేఖర్‌, వైస్‌చైర్మన్‌ కనికరపు రాకేశ్‌, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

విద్యా సదస్సును విజయవంతం చేయండి

వేములవాడఅర్బన్‌: తెలంగాణ ప్రోగెసిస్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 30న హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్ర విద్యాసదస్సును విజయవంతం చేయాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్‌కుమార్‌ కోరా రు. వేములవాడ మున్సిపల్‌ పరిధి తిప్పాపూర్‌లోని జెడ్పీ హైస్కూల్‌లో టీపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో వాల్‌పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించా రు. జిల్లా అధ్యక్షుడు రమానాథ్‌, దేవేందర్‌, కిష న్‌, రజనీరాణి, తిరుపతి, బొజ్జ కృష్ణ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement