సిరిసిల్ల/తంగళ్లపల్లి(సిరిసిల్ల): రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. తంగళ్లపల్లి మండలం తాడూర్‌లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కేంద్రాల వద్ద నీడ కోసం టెంట్లు, తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో గీత, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వెలుముల స్వరూప, వైస్‌చైర్మన్ నేరెళ్ల నర్సింగంగౌడ్, సర్పంచ్ రెడ్డిమల్ల సదానందం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్ టోని పాల్గొన్నారు.
ప్రజలకు పారదర్శక సేవలు అందించాలి
ప్రభుత్వ కార్యాలయాల ద్వారా ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నూతన భవనంలోకి మార్చిన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించారు. సర్పంచ్ మోర లక్ష్మీరాజం, ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ విజయ ప్రకాశ్‌రావు, ఎంపీడీవో కె.లక్ష్మీనారాయణ, ఏఎంసీ వైస్‌చైర్మన్ నేరెళ్ల నర్సింగంగౌడ్ పాల్గొన్నారు.
విద్యుత్ సబ్‌స్టేషన్లకు స్థలం కేటాయించండి
జిల్లాలో విద్యుత్ లోడ్‌కు అనుగుణంగా కొత్తగా ఐ దు సబ్‌స్టేషన్లకు స్థలం కేటాయించాలని కలెక్టర్ గరీ మా అగ్రవాల్‌ను ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ వేణుమాధవ్ కోరారు. ఇటీవల జిల్లా ఎన్పీడీసీఎల్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్‌గా విధుల్లో చేరిన వేణుమాధవ్ మర్యాద పూర్వకంగా కలెక్టర్‌ను కలిశారు.


