పకడ్బందీగా జనగణన చేయాలి | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా జనగణన చేయాలి

Apr 20 2026 9:17 AM | Updated on Apr 20 2026 9:17 AM

● జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి పీబీ శ్రీనివాసాచారి

● జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి పీబీ శ్రీనివాసాచారి

సిరిసిల్ల: పకడ్బందీగా జనగణన పూర్తి చేయాలని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి పి.బి.శ్రీనివాసాచారి కోరారు. హౌస్‌లిస్టింగ్‌ బ్లాక్స్‌, సెన్సస్‌ మానిటరింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ డిజిటల్‌ విధానం, స్వీయగణనపై సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లకు సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు, గంభీరావుపేట, తంగళ్లపల్లి, కోనరావుపేట, వేములవాడరూరల్‌ మండలాల్లో ఆదివారం శిక్షణ ఇచ్చారు. వేసవి నేపథ్యంలో ఇన్‌చార్జ్‌ అధికారులు, తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్ల ఆధ్వర్యంలో శిక్షణకు హాజరయ్యే వారికి భోజనం, ఇతర వసతులు సరైన విధంగా కల్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. మొదటి దశలో మే 11 నుంచి జూన్‌ 9 వరకు ఇండ్ల గణన నిర్వహిస్తారని, రెండో దశ ఫిబ్రవరి 2027లో వ్యక్తుల వారీగా సమాచారం సేకరిస్తారని తెలిపారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని బాధ్యతల నిర్వహణ ఎంతో కీలకమని శ్రీనివాసాచారి స్పష్టం చేశారు. జనగణన జిల్లా ఇన్‌చార్జి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement