● విష్ణు సేవ నందగిరిస్వామీజీ
ఇల్లంతకుంట(మానకొండూర్): హిందూ ధర్మ రక్షణకు హిందువులు నడుం బిగించాలని నందగిరి స్వామీజీ కోరారు. మండలంలోని గాలిపెల్లి వేణుగోపాలస్వామి ఆలయ ఆవరణలో ఆదివారం నిర్వహించిన హిందూ సమ్మేళనంలో మాట్లాడారు. హిందుత్వం మానవాళి హితం కోరే ధర్మమన్నారు. మతం వేరు ధర్మం వేరు అని పేర్కొన్నార. హిందువులు సమైక్యంగా కలిసి జీవించాలని సూచించారు. ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ సామల కిరణ్ మాట్లాడుతూ హిందువులు స్వాభిమానం దేశభక్తి, సేవాభావం పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షుడు మల్లుగారి దేవేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, కోశాధికారి అయ్యన్నగారి హరికృష్ణరెడ్డి, సర్పంచులు బద్దం శేఖర్‌రెడ్డి, శంకరమ్మ, సింగిరెడ్డి రచన, సభ్యులు బాలనాగాచారి, వంశీ, బత్తిని ఆంజనేయులు, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘మహిళాబిల్లుకు డీలిమిటేషన్ ముసుగు ఎందుకు? ’
సిరిసిల్లటౌన్: మహిళా బిల్లు ముసుగులో కేంద్రం ప్రభుత్వం డీలిమిటేషన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ప్రజలకు వివరించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సిరిసిల్లలోని డీసీసీ ఆఫీసులో ఆదివారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. 2023లో పాసైన మహిళా బిల్లును యథాతథంగా ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ ఆడెపు చంద్రకళ, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, కౌన్సిలర్లు వెంగల లీల, లాయక్ సుల్తాన, బొద్దుల శ్రీనివాస్, కూరపాటి శ్రీశైలం, నాయకులు చొక్కాల రాము, రాగుల జగన్, వెంగల లక్ష్మినర్సయ్య, కంసాల మల్లేశం, ఆడెపు భాను పాల్గొన్నారు.
సీఎం సభను విజయవంతం చేయండి
ఇల్లంతకుంట(మానకొండూర్): మంథని నియోజకవర్గంలోని కాటారంలో సోమవారం నిర్వహించే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ కోరారు. మండలంలోని ముస్కానిపేటలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేసి మాట్లాడారు. సీఎం సభకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో తరలిరా వాలని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు భా స్కర్‌రెడ్డి, నాయకులు అంతగిరి వినయ్‌కుమార్, జుట్టు శేఖర్, సూర దేవరాజు, చింతలపల్లి ర వీందర్‌రెడ్డి, కాసుపాక రమేశ్, భూపతిరెడ్డి, మల్లారెడ్డి, వంశీ, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
హామీలు నెరవేర్చాలి
సిరిసిల్లటౌన్: ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ఆర్టీసీ సిబ్బందికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని జేఏసీ చైర్మన్ బానయ్య కోరారు. రాష్ట్ర కమిటీ సమ్మెమ సన్నాహక పిలుపులో భాగంగా ఆదివారం సిరిసిల్ల డిపో ఎదుట గేట్ ధర్నా నిర్వహించి మాట్లాడారు. ఆర్టీసిని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. జేఏసీ వైస్‌చైర్మన్లు జె.ఎస్.ఎన్.రావు, బి.శ్రీనివాస్, కన్వీనర్ రమేశ్, గ్యారేజ్ కో–కన్వీనర్ మల్లేశం, నాగసాగర్, భూమయ్య, మల్లయ్య, సత్తయ్య, భిక్షపతి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా గైడ్స్ దీక్షా స్వీకారోత్సవం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని నేరెళ్లలోని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంలో ఆదివారం స్కౌట్స్ అండ్ గైడ్స్ దీక్షా స్వీకారోత్సవం నిర్వహించారు. పాఠశాలకు చెందిన 32 మంది గైడ్స్ విద్యార్థినులకు అధికారికంగా గైడ్స్ దుస్తులను(యూనిఫాం) పంపిణీ చేశారు. అనంతరం గైడ్స్ ప్రమాణ స్వీకారం చేసి దీక్షను స్వీకరించారు. జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ సెక్రటరీ రాజా భానుప్రకాశ్, మండల విద్యాధికారి భూక్య రాజు, పాఠశాల ప్రిన్సిపాల్ జి.రాధ, సర్పంచ్ పొన్నం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


