రైతును రాజు చేయడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రైతును రాజు చేయడమే లక్ష్యం

Apr 20 2026 9:17 AM | Updated on Apr 20 2026 9:17 AM

ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

రుద్రంగి(వేములవాడ): రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తోందని విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఆదివారం అడిషనల్‌ కలెక్టర్‌ నగేశ్‌తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ముందుగా సూరమ్మ ప్రాజెక్టును సందర్శించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. యాసంగిలో పంట లు ఎండిపోకుండా ఉండేందుకు ఇప్పటికే మూడుసార్లు ఎల్లంపెల్లి నీటిని నాగారం చెరువులోకి విడుదల చేసినట్లు తెలిపారు. వేసవిలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రుద్రంగి అచ్చయ్యకుంట, నాగారం చెరువులను నింపినట్లు పేర్కొన్నారు. రుద్రంగి సర్పంచ్‌ గండి లక్ష్మీనారాయణ, ఏఎంసీ చైర్మన్‌ చెలుకల తిరుపతి, ఉపసర్పంచ్‌ మాడిశెట్టి అభిలాశ్‌, మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, గంగనర్స య్య, మీనయ్య, శంకర్‌ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరికలు

వేములవాడ: కోనరావుపేట మండలం నిమ్మపల్లి, గొల్లపల్లి, మరిమడ్ల సర్పంచులు కమ్మరి స్వప్న–నాగరాజు, మాడుగుల ఆమని–శ్రీకాంత్‌, కోల స్వాతి–శ్రీనివాస్‌లు విప్‌ ఆది శ్రీనివాస్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నిమ్మపల్లి వార్డుసభ్యులు మ్యాదరి రాఘవేందర్‌, దేవయ్య, పూజారి లావణ్య లింబయ్య కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement