గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం

Apr 20 2026 9:17 AM | Updated on Apr 20 2026 9:17 AM

● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం

● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం

బోయినపల్లి(చొప్పదండి): గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండలంలోని కోరెం కొండపోచమ్మ ఆలయం వద్దకు రూ.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, ఆలయం వరకు 21 స్తంభాలు అమర్చిన సింగిల్‌ఫేజ్‌ విద్యుత్‌ పనులను, కొదురుపాకలో పలు అభివృద్ధి పనులను ఆదివారం ప్రారంభించారు. కొండపోచమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అంగన్‌వాడీలకు సెల్‌ఫోన్లు పంపిణీ చేశారు. పీఆర్‌ డీఈ విష్ణువర్ధన్‌, ఎంపీడీవో జయశీల, సెస్‌ ఏఈ ప్రశాంత్‌, పీఆర్‌ ఏఈ సాయితేజ, జోగినపల్లి వెంకట్రామారావు, ముదుగంటి సురేందర్‌రెడ్డి, బీసీ సెల్‌ అధ్యక్షుడు కూస రవీందర్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, సెస్‌ డైరెక్టర్‌ కొట్టెపెల్లి సుధాకర్‌, ఏఎంసీ చైర్మన్‌ ఎల్లేశ్‌యాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement