యువకుల్లో క్రీడాస్ఫూర్తిని నింపేందుకు తెలంగాణ సాధకులు, రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ పేరిట క్రికెట్ పోటీలను ఏర్పాటు చేశాం. అన్ని మండలాల్లోనూ ఉత్సాహంగా పోటీలు సాగుతున్నాయి. అన్ని స్థాయిల్లోనూ యువకులు తమ క్రీడా నైపుణ్యాన్ని చాటుతున్నారు. అన్ని ప్రాంతాల నుంచి క్రికెట్ పోటీలకు మంచి స్పందన వస్తుంది. యువతలో క్రీడాసక్తి పెరిగింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆలోచనకు అనుగుణంగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది.
– తోట ఆగయ్య,
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు


