సిరిసిల్ల: ఫోర్..సిక్సర్..వికెట్..ఔట్.. అనే మాటలతో జిల్లా మారుమోగుతోంది. పొద్దంతా మైదానాల్లో కేసీఆర్ క్రికెట్ పోటీలు.. రాత్రయితే టీవీల్లో ఐపీఎల్ వీక్షణతో జిల్లా యువకుల్లో క్రికెట్ జోష్ నిండింది. దేశవ్యాప్తంగా ఐపీఎల్ సీజన్ ప్రారంభంకావడం.. పది, ఇంటర్ పరీక్షలు ముగియడం.. ఎండాకాలం షురూ కావడం.. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ పేరుతో ఈనెల 10న క్రికెట్ పోటీలు ప్రారంభించారు. ఎండలను సైతం లెక్కచేయకుండా యువకులు కేసీఆర్ క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నారు. యువతను క్రీడల వైపు మళ్లించడమే లక్ష్యంగా ఈ పోటీలు సాగుతున్నాయి. ఈనెల 25 వరకు సాగే క్రికెట్ పోటీలను బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్
ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు పర్యవేక్షిస్తున్నారు.


