● పెండింగ్ బిల్లుల కోసం జేఏసీ నిరసన
సిరిసిల్ల: జిల్లా ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లా ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎలుసాని ప్రవీణ్, కో చైర్మన్ సమరసేన్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఉద్యోగులకు రావలసిన పెండింగ్ బిల్లులు, పీఆర్సీ, ఈహెచ్‌ఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. జిల్లా పరిశీలకులుగా వచ్చిన రాష్ట్ర లెక్చరర్ల ఫోరం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు ఇవ్వాల్సిన రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావలసిన అన్ని రకాల బెనిఫిట్స్‌ను మంజూరు చేయాలన్నారు. ఉద్యోగుల హెల్త్‌కార్డులను వెంటనే పూర్తి చేయాలని, సీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసీ, ఓపీఎస్ విధానం అమలు చేయాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేర్చాలని కోరారు. టీఎన్‌జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల సుదర్శన్, జిల్లా టీజీవో కార్యదర్శి సయ్యద్ జబి, శ్రీకాంత్, రియాజ్‌పాషా, సాగర్ పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌కు ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు వినతిపత్రం అందించారు.


