పోలీసులకు కూలింగ్‌ గ్లాసెస్‌ | - | Sakshi
Sakshi News home page

పోలీసులకు కూలింగ్‌ గ్లాసెస్‌

Apr 17 2026 10:32 AM | Updated on Apr 17 2026 10:32 AM

సిరిసిల్ల క్రైం: పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని పోలీస్‌ సిబ్బంది ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ మహేశ్‌ బీ గీతే తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి గురువారం కూలింగ్‌ గ్లాసెస్‌ అందజేశారు. తీవ్ర ఎండల సమయంలో విధులు నిర్వహించే సిబ్బంది తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ట్రాఫిక్‌ సిబ్బంది, బ్లూ కోల్ట్స్‌్‌, పెట్రోకార్‌ సిబ్బంది, బందోబస్తు విధుల్లో పాల్గొనే వారు తరచూ నీరు, గ్లూకోజ్‌ తీసుకోవాలని సూచించారు. హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ వినియోగం, ర్యాష్‌డ్రైవింగ్‌, మద్యం సేవించి వాహనం నడపడం, మైనర్‌ డ్రైవింగ్‌ వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించాలని ఆదేశించారు. ట్రాఫిక్‌ ఆర్‌ఐ సురేశ్‌, ఆర్‌ఎస్సైలు రాజు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement